- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sambarala Yeti Gattu: కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఐకానిక్ పెర్ఫార్మెన్స్.. హైప్ పెంచేస్తున్న స్టార్ నటుడి పోస్ట్
విలక్షణ నటుడు సాయి కుమార్.. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

దిశ, సినిమా: విలక్షణ నటుడు సాయి కుమార్.. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీమలో ఆయన క్రేజ్‌ను నిలుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టిన రోజు సందర్భంగా.. సాయి కుమార్ నటిస్తున్న చిత్రాల నుంచి వరుస పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’తో పాటు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘సంబరాల ఏటిగట్టు’లో కూడా సాయి కుమార్ కీలక పాత్ర నటిస్తున్నారు.
ఇందులో భాగంగా.. ఈ సినిమా నుంచి ఆయనకు బర్త్‌డే విష్ తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘సంబరాలయేటిగట్టు ప్రపంచం నుండి వచ్చిన అద్భుతమైన నటుడు సాయి కుమార్‌ను రాయప్పగా పరిచయం చేస్తున్నాము. తన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఐకానిక్ పెర్ఫార్మెన్స్‌తో రాయప్ప యుగాలకు ఒక పాత్రగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ప్రస్తుతం విశేష స్పందన లభిస్తుంది. లింక్






