- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sai Dharam Tej: నా లైఫ్‌లో విలన్ ఆయనే.. షాకింగ్‌గా సాయి ధరమ్ తేజ్ కామెంట్స్
ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’.

దిశ, సినిమా: ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సీరిస్‌కు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ సోనీలివ్ ఒరిజినల్స్‌లో ఆగస్టు 7 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు మేకర్స్. రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథ.. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైనా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మొదట డైరెక్టర్ దేవతో తన జర్నీ గురించి తెలిపి.. నాకు ఎప్పుడూ అండగా నిలిచారంటూ ఆయనపై ఎమోషనల్‌గా తెలిపాడు. అలాగే ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసని చెప్పిన తేజ్.. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడండూ అక్కడ నవ్వులు కురించాడు. ఇక ‘మయసభ’ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపాడు.






