పెళ్లి కాకుండానే బేబీబంప్‌తో దర్శనమిచ్చిన సాయి ధరమ్ తేజ్ బ్యూటీ.. సీమంతం ఫొటోలు వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-14 15:12:40  IST  )

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) 2017లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంది.

పెళ్లి కాకుండానే బేబీబంప్‌తో దర్శనమిచ్చిన సాయి ధరమ్ తేజ్ బ్యూటీ.. సీమంతం ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) 2017లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంది. అదే ఏడాది ‘మాయనది’ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆమె ఫిల్మ్‌ఫేర్, సైమా, క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. ‘గాడ్సే’(Godse) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’(Ponnian Selvan) సినిమాతో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా ‘మామన్’(Maaman) మూవీలో నటించింది. ఇక ఇందులో తమిళ యాక్టర్ సూరి(Suri) హీరోగా నటించాడు.మేనమామ, మేనళ్లుడు రిలేషన్ గురించి రూపొందిన ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetugattu) మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఐశ్వర్య లక్ష్మికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో పెళ్లి కాకుండానే బేబీ బంప్‌తో దర్శనమివ్వడమే కాకుండా సీమంతం చేసుకుంటున్నట్లు కనిపించింది. చేతినిండా గాజులతో చీర కట్టుకొని, గంధం పూసుకుని, పూలు పెట్టుకొని చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పిక్స్ మామన్ మూవీలోనివి అన్నట్లు తెలుస్తోంది.

Next Story