- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KA దర్శకులతో మెగా హీరో భారీ సినిమా..ఏకంగా ఇద్దరు హీరోయిన్లు ?
ఈ Ka సినిమా దర్శకులతో కొత్త సినిమా చేసేందుకు సాయిధరమ్ తేజ సిద్ధమయ్యాడట. ఈ మేరకు చర్చలు జరిగి హీరోయిన్లు కూడా ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ డిఫరెంట్ కథాంశాలతో వస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. కథలో బలం ఉంటే ఎలాంటి రిస్క్ అయినా చేస్తూ, ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. అయితే అలాంటి సాయి ధరమ్ తజ్, ఇప్పుడు మరో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. Ka సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సుజిత్, సందీప్. కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ఇద్దరు హీరోయిన్లతో మెగా హీరో రొమాన్స్
ఓ గ్రామం చుట్టూ తిరిగే ఒక కథను అద్భుతంగా తీశారు సుజిత్, సందీప్. అయితే ఈ Ka సినిమా దర్శకులతో కొత్త సినిమా చేసేందుకు సాయిధరమ్ తేజ సిద్ధమయ్యాడట. ఈ మేరకు చర్చలు జరిగి హీరోయిన్లు కూడా ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ప్రకటన కూడా రానుందట. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంభో శివ శంకర అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ కూడా చేశారట. ఐశ్వర్య రాజేష్, మృణాల్ ఠాకూర్ లను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.






