- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ కు మరో అవమానం..సాయి ధరమ్ తేజ్ షాకింగ్ స్టేట్మెంట్!
సాయి ధరంతేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాస్తవానికి రామ్ చరణ్ కంటే ఎక్కువగానే అల్లు అర్జున్

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒక్కరి అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్.
అంతేకాదు కేరళ అలాగే బీహార్ రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారు. అమ్మాయిలు కూడా అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతారు. అయితే అలాంటి అల్లు అర్జున్ పరువు తీసేలా వ్యవహరించారు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరో ఎవరు అని సాయి ధరంతేజ్ ను ప్రశ్నించారు.
దీంతో వెంటనే రాంచరణ్ అలాగే పవన్ కళ్యాణ్ పేర్లను చెప్పాడు సాయి ధరంతేజ్. ఆ ఒక్క మాటతో సాయి ధరంతేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాస్తవానికి రామ్ చరణ్ కంటే ఎక్కువగానే అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారని.. కానీ కావాలనే అతన్ని ఇన్సల్ట్ చేసే విధంగా సాయి ధరంతేజ్.. వ్యవహరిస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి సాయి ధరంతేజ్ వ్యవహరించాడని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ రియల్ స్టైలిష్ స్టార్ అంటున్నారు.






