Kishkindhapuri: ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారు.. కిష్కింధపురిపై నిర్మాత కామెంట్స్

by Chukka Sudharani |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.

Kishkindhapuri: ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారు.. కిష్కింధపురిపై నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సాహు గారపాటి సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్‌ ఉన్న కథ కిష్కిందపురి. ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. కానీ ఇది మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండిటి బ్లెండ్‌తో చాలా కొత్త కథ చెప్పా దర్శకుడు. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్ దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్‌ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదు. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్‌గా టర్న్ అవుతుంది. ఈ సినిమా కోసం దాదాపు రెండు కోట్లతో సెట్ వేశాము. సెట్ వెయ్యడానికే నెల రోజులు సమయం పట్టింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ తప్పకుండా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. విజువల్, మ్యూజికల్‌గా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చాలా షాక్ ఫ్యాక్టర్స్, ఆడియన్స్ భయపడే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కచ్చితంగా ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని తెలిపాడు.

Next Story