- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సఃకుటుంబానాం’ ట్రైలర్ లాంచ్
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘సఃకుటుంబానాం’. హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన సినిమాకు ఉదయ్ శర్మ దర్శకులు.

దిశ, సినిమా : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘సఃకుటుంబానాం’. హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన సినిమాకు ఉదయ్ శర్మ దర్శకులు. కాగా డిసెంబర్ 12వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ లాంచ్ చేశారు. తన స్నేహితుడు విక్రమ్ ఒక లైన్ సినిమాగా చేయాలి అనుకున్నాడు కానీ ఆయన చనిపోవడం జరిగింది. అదే లైన్‌ను తన స్నేహితుడు ఉదయ్ ఒక కథగా మార్చి ఆ కథను సినిమాగా చేస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషించానని అన్నారు. ఈ సినిమా సుకుమార్ గారి ఐడియాలో ఉండబోతుందని.. సఃకుటుంబానాం చిత్రం మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, హీరో రామ్ కిరణ్, తదితరులు హాజరయ్యారు.






