‘సఃకుటుంబానాం’ వాయిదా

by Sujitha Rachapalli |

హెచ్ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం

‘సఃకుటుంబానాం’ వాయిదా
X

దిశ, సినిమా : హెచ్ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్‌గా శశాంక్ మలి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు సోషల్ మీడియా ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సఃకుటుంబానాం’ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్ర తదుపరి విడుదల తేది అతి త్వరలో తెలియజేస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Next Story