- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది.. టాక్సిక్ మూవీపై రుక్మిణి వసంత్ కామెంట్స్
రాకింగ్ స్టార్ యష్ త్వరలో ‘టాక్సిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ త్వరలో ‘టాక్సిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగుళూరులో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీలో క్రేజీ అండ్ సెన్సేషనల్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ ‘టాక్సిక్’ విశేషాలు పంచుకుంది. ‘‘టాక్సిక్’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుంది.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అంటూ రుక్మిణి చెప్పిన మాటలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కన్నడ, ఆంగ్ల భాషలలో చిత్రీకరించబడుతున్న ఈ భారీ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.






