- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rukmini Vasanth: తన పర్ఫామెన్స్ బ్యూటిఫుల్.. ఆ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించిన రుక్మిణి వసంత్
యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’. శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం సప్టెంబర్5న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను శివ కార్తికేయన్‌కు సర్టిఫైడ్ ఫ్యాన్‌గర్ల్‌ని. అలా చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. ఎందుకంటే ఆయన వర్క్‌ను నేను ఎప్పుడు ఆరాధిస్తాను. అండ్ వర్క్ విషయంలో ఆయన డెడికేషన్, ఇంట్రెస్ట్ నాకు నిజంగా స్ఫూర్తినిస్తాయి. అతనితో షూటింగ్ చేయడం నిజంగా వరంగా ఫీల్ అవుతున్నా’ అని తెలిపింది.
అలాగే సాయి పల్లవి (Sai Pallavi) గురించి మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి నిజంగా అమేజింగ్ యాక్టర్. తనకు ఏం చెయ్యాలో తెలుసు.. పీపుల్‌కు ఎలా కమ్యునికేట్ చెయ్యాలో తనకు తెలుసు. ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది ఓ క్లారటీతో ఉంటారు సాయి పల్లవి. అలాగే తన కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలో.. తనకు ఏం కావాలో ఒక పోకస్‌పై ఉంటుంది. దాన్ని కచ్చితంగా అనుసరిస్తూ వర్క్ డిసైడ్ చేసుకుంటుంది. ముఖ్యంగా తన పర్ఫామెన్స్ నిజంగా బ్యూటిఫుల్’ అంటూ తెలిపింది. లింక్






