ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న కొత్త హీరోయిన్‌..ఇక అంద‌రూ సైడ్ అవ్వాల్సిందే !

by velandi.Saikiran |

రుక్మిణికి కాంతార చాప్ట‌ర్ 1 లో కూడా ఛాన్స్ ద‌క్కింది. ఈ సినిమా ద‌స‌రా కానుగా రిలీజ్ కానుంది.

ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న కొత్త హీరోయిన్‌..ఇక అంద‌రూ సైడ్ అవ్వాల్సిందే !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండస్ట్రీ లోకి చాలామంది హీరోయిన్లు వస్తున్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే... మరికొంతమంది సక్సెస్ అయ్యేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు... అతి తక్కువ కాలంలోనే పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. అయితే ఇలాంటి కేటగిరీలోకి హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా వస్తారు. కర్ణాటక కు చెందిన రుక్మిణి వసంత్ 2019 నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కన్నడ, తమిళ్, తెలుగు లో ఇప్పటికే సినిమాలు చేశారు ఈ అందాల తార. తెలుగులో అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ దక్కింది.

అయితే... ఈ రుక్మిణికి కాంతార చాప్ట‌ర్ 1 లో కూడా ఛాన్స్ ద‌క్కింది. ఈ సినిమా ద‌స‌రా కానుగా రిలీజ్ కానుంది. ఇలాంటి నేప‌థ్యంలో కాంతార చాప్ట‌ర్ 1 మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఇందులో హీరో రిష‌బ్ శెట్టితో రొమాన్స్ కూడా చేసిన విజువ‌ల్స్ వైర‌ల్ గా మారాయి. ముఖ్యంగా ఆమె గ్లామ‌ర‌స్ ఫోటోలు కూడా ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. ఇక ఈ ఫోటోలు చూసిన సినీ ప్రియులు స్పందిస్తున్నారు. రుక్మిణి వసంత్ కూడా ర‌ష్మిక‌, సాయి ప‌ల్ల‌వి లాగే మ‌రో 10 ఏళ్లు ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం గ్యారెంటీ అంటున్నారు. డ్రాగ‌న్ సినిమా రిలీజ్ అయితే తెలుగులో నెంబ‌ర్ 1 హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Next Story