Rukmini Vasanth: మణిరత్నం డైరెక్షన్‌లో ప్రేమ కథ చిత్రం.. హీరోయిన్‌గా ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ

by Chukka Sudharani |

ఈ ఏడాది ‘థగ్ లైప్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు డైరెక్టర్ మణిరత్నం.

Rukmini Vasanth: మణిరత్నం డైరెక్షన్‌లో ప్రేమ కథ చిత్రం.. హీరోయిన్‌గా ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘థగ్ లైప్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు డైరెక్టర్ మణిరత్నం. కమల్ హాసన్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కి జూన్ 5న థియేటర్స్‌లో రిలీజై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు డైరెక్టర్ మణిరత్నం తన తదుపరి మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. ఈసారి యాక్షన్ డ్రామాతో కాకుండా.. ప్రేమ కథ చిత్రంతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. ఇందులో మొదట హీరోగా ధృవ్ విక్రమ్ ఎంపిక చేశారట. కానీ ఇప్పుడు వేరే హీరో కోసం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ధృవ్‌తో తర్వాత యాక్షన్ చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

అందుకే ఇప్పుడు తెరకెక్కించబోయే ప్రేమ కథ చిత్రానికి వేరే హీరో కోసం వెతుకుతున్నాడట మణిరత్నం. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిచబోతుండగా.. ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశారు. కొడైకెనాల్‌లో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తికాగా.. లొకేషన్ స్కౌటింగ్ దాదాపు సెట్ అయిందని సమాచారం. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని తెలుస్తుండగా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రాబోతున్నట్లు టాక్. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది.

Next Story