- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alcohol: ‘ఆల్కహాల్’లో క్రేజీ హీరోయిన్.. పోస్టర్‌తో కిక్ ఇచ్చిన చిత్ర బృందం
ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు రూటు మార్చి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

దిశ, సినిమా: ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు రూటు మార్చి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే మోహర్ తేజ్ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ కెరీర్‌లో 63వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘ఆల్కహాల్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. ఇందులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారకి ఎన్‌ఎమ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇప్పుడు ఈ సినిమాలో రుహాని శర్మ కూడా భాగం కాగా.. ఆమె బర్త్‌డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ప్రతి ఫ్రేమ్‌కి సరైన హై ఉంటుంది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన రుహాని ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీగా నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ ఫుల్ డ్రింకర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. లింక్






