ఆ తేదీన రీ రిలీజ్ కానున్న రుద్రమదేవి

by Pulgam srinivas |

రుద్రమదేవి సినిమాను మే 22వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఆ తేదీన రీ రిలీజ్ కానున్న రుద్రమదేవి
X

దిశ, వెబ్ డెస్క్: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి చిత్రం 2015లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో పలు హిట్ చిత్రాలు రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ బృందం నిర్ణయించింది. ఈ మేరకు ఈ సినిమాను మే 22వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ రీ రిలీజ్ సందర్భంగా రుద్రమదేవి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండటంతో రీ రిలీజ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో శివ కుమార్ శ్రీపాద, విక్రమ్‌జిత్ విర్క్, ప్రకాశ్ రాజ్, కృష్ణంరాజు, నిత్యా మీనన్, ఆదిత్య మీనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.




Next Story