Sandhya Theater incident: రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం

by Gantepaka Srikanth |

సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రి

Sandhya Theater incident: రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రి(Kims Hospital)లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej)ను ఎఫ్‌డీసీ(Telangana Film development corporation) చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సుకుమార్‌లు మరోసారి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్(Allu Arjun) రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్(Sukumar) రూ.50 లక్షలు, చిత్ర నిర్మాతలు(మైత్రీ మూవీ మేకర్స్) రూ.50 లక్షలు.. ఇలా మొత్తంగా రూ.2 కోట్ల చెక్కులను రేవతి కుటుంబానికి అందజేయనున్నారు. మరోవైపు బాలుడు శ్రీతేజ్‌ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

Next Story