భారీ షెడ్యూల్‌కు సిద్ధమైన ‘రౌడీ జనార్ధన’ యూనిట్

by Pulgam srinivas |

రౌడీ జనార్ధన నెక్స్ట్ షెడ్యూల్‌ను మే చివరిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక యాక్షన్ సన్నివేశంతో పాటు సాంగ్‌ను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

భారీ షెడ్యూల్‌కు సిద్ధమైన ‘రౌడీ జనార్ధన’ యూనిట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌడీ జనార్ధన’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి కొంతకాలం క్రితం ఓ గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా, అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిన్న వీడియోతో ఈ సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయికి చేరిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది.

ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్‌ను మే చివరిలో రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ చాలా రోజులు ఉండనున్నట్లు సమాచారం. ఇందులో ఒక యాక్షన్ సన్నివేశంతో పాటు సాంగ్‌ను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా రూపొందించినట్లు తెలుస్తుంది. అలాగే ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన’తో పాటు ‘రణబాలి’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అలాగే శౌర్యవ్ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అయ్యాడు.

Next Story