ఆ తేదీ నుంచి 'రౌడీ జనార్ధన' నెక్స్ట్ షెడ్యూల్

by Pulgam srinivas |

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రౌడీ జనార్ధన చిత్రానికి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఏప్రిల్ 16 నుండి ప్రారంభం కానుంది.

ఆ తేదీ నుంచి రౌడీ జనార్ధన నెక్స్ట్ షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో, రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి చిత్రంతో పాటు, రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న 'రౌడీ జనార్ధన'లో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నను వివాహం చేసుకున్నాడు. దాంతో కొంతకాలం పాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్న ఈ నటుడు కొన్ని రోజుల క్రితమే రణబాలి చిత్ర షూటింగ్‌లో తిరిగి జాయిన్ అయ్యాడు. మరికొన్ని రోజుల్లోనే రౌడీ జనార్ధన సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రౌడీ జనార్ధన చిత్రానికి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఏప్రిల్ 16 నుండి ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల చివరి వరకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లోని పలు లొకేషన్లలో మేకర్స్ షూటింగ్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ చిత్రంపై ప్రస్తుతం మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, మలయాళ సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story