Roshan: రోషన్ ‘చాంపియన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Chukka Sudharani |   (  Updated:2025-10-06 13:23:11  IST  )

హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోషన్.. నిర్మలా కాన్వెంట్, పెళ్లింసందDతో హిట్ అందుకున్నాడు.

Roshan: రోషన్ ‘చాంపియన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోషన్.. నిర్మలా కాన్వెంట్, పెళ్లింసందDతో హిట్ అందుకున్నాడు. ప్రజెంట్ ఈ హీరో ‘చాంపియన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతున్నప్పటికీ రిలీజ్ డేట్‌పై మాత్రం ఇప్పటి వరకు అనౌన్స్‌మెంట్ రాలేదు. అసలు సినిమా ఉందా లేదా డైలమాలో ప్రేక్షకులు ఉండగా.. తాజాగా గుడ్ న్యూస్ ప్రకటించారు చిత్ర బృందం. ఈ ఏడాది క్రిస్మస్ స్పెషల్‌గా ‘చాంపియన్’ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఆట ప్రారంభమవుతుంది. చాంపియన్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా చాంపియన్ సినిమా థియేటర్లలోకి రాబోతున్నది.. అద్భుత ప్రయాణాన్ని అనుభవించడానికి’ సిద్ధంగా ఉండండి అంటూ డేట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ స్టోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతుండగా.. స్పప్న సినిమాస్, జీ స్డూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. లింక్

Next Story