- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శక్తివంతమైన రైడ్‌లో రోషన్ కనకాల.. ఫొటో వైరల్ కావడంతో హిట్ పక్కా అంటున్న నెటిజన్లు
‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’.

దిశ, సినిమా: ‘కలర్ ఫొటో’ (Color photo) ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’ (Mowgli). రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ల్ లుక్, టైటిల్ పోస్టర్ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా.. మోగ్లీ మూవీ కోసం రోషన్ తన లుక్ మొత్తం చేంజ్ చేసుకొని ఎంతో కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు. ఇటీవల ‘మోగ్లీ యొక్క అతిపెద్ద యాక్షన్ షెడ్యూల్ సిద్ధం అవుతోంది’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఇందులో రోషన్ బ్యాక్ నుంచి కనిపించగా.. రీసెంట్‌గా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ‘శక్తివంతమైన రైడ్‌లో.. రాబోయే దానికి నాంది పలుకుతున్నారు రోషన్. నిర్భయ.. ఉగ్ర.. స్వేచ్ఛాయుత యువ హీరో రోషన్ కనకాల’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌లో గుర్రంపై ఉన్న రోషన్ లుక్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. దీంతో ఈసారి హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






