- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రొమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
జూలై 31న ఈ ‘రొమియో జూలియట్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డిఫరెంట్ పోస్టర్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

దిశ, సినిమా: యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, గ్లామరస్ బ్యూటీ విశాక ధిమన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రొమియో జూలియట్’. భార్గవ మాచర్ల దర్శకత్వం వహించగా.. నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్, డాలీ స్టూడియోస్, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు సందీప్, వెంకటేశ్వర రావు చల్లగుల్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. జూలై 31న ఈ ‘రొమియో జూలియట్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డిఫరెంట్ పోస్టర్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లో హీరోయిన్ విశాక ధిమన్ ఎంతో సరదాగా సెల్ఫీ తీస్తూ కనిపిస్తుండగా, హీరో హర్షిత్ రెడ్డి మాత్రం ఒక పెద్ద ఇన్‌స్టాగ్రామ్ బోర్డ్‌ను తన మెడలో వేసుకుని, ఏదో కోల్పోయినట్లు చాలా అసహనంగా ముఖం పెట్టి చూస్తూ కనిపించాడు. ఈ కాలం యువత సోషల్ మీడియాకు ఏ రేంజ్‌లో కనెక్ట్ అయిందో, దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో అన్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చాలా ఫన్నీగా ఉంది. అంతేకాకుండా, ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ మూవీ టీమ్ పెట్టిన క్యాప్షన్ కూడా మరింత క్రేజీగా ఉంది. ‘విన్నర్ విన్నర్.. నో చికెన్ డిన్నర్’ అంటూ పబ్‌జీ గేమ్‌ను గుర్తుచేసేలా పెట్టిన ఈ క్యాప్షన్ యువతను బాగా ఆకర్షిస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా నేటి తరం సరికొత్త లవ్ ట్రెండ్‌ను ప్రతిబింబించేలా ఉంటుందని అర్థమవుతోంది.






