న్యూ ఇయర్ స్పెషల్ ‘బ్యాండ్ మేళం’ నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..

by I. Sairam |   (  Updated:2026-01-01 07:56:12  IST  )

‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) కలిసి నటిస్తున్న సినిమా ‘బ్యాండ్ మేళం’(Band Melam).

న్యూ ఇయర్ స్పెషల్ ‘బ్యాండ్ మేళం’ నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) కలిసి నటిస్తున్న సినిమా ‘బ్యాండ్ మేళం’(Band Melam). స‌తీష్ జ‌వ్వాజీ(Sathish Javvaji) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్(Kona Venkat) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి చంద్ర‌బోస్(Chandrabose) సంగీతం అందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుద‌లకాగా.. ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఈ క్రమంలో నేడు కొత్త సంవత్సర సందర్భంగా ఈ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘బ్యాండ్ మేళం బృందం నుంచి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. రాబోయే సంవత్సరం ప్రేమ, సంగీతం మరియు హృదయానికి దగ్గరగా ఉండే క్షణాలతో ముందుకు సాగాలి’ అని రాసుకొస్తూ హీరో హీరోయిన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక పోస్టర్‌లో బ్రిడ్జిపైన హీరో రోషన్ బైక్ నడుపుతుండగా వెనక శ్రీదేవి హీరోయిన్ నవ్వుతూ కూర్చొంది. ఇక బైక్ ట్యాంక్ పైన హార్మోనియం ఉంది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story