- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనకంటే పెద్ద వారితో రొమాన్స్ బాగుంటుంది.. సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి.. అమీషా పటేల్ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ ‘సికందర్’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ ‘సికందర్’. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) సల్మాన్ సరసన నటించింది. ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహించగా.. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. అయితే ‘సికందర్’(Sikander) మూవీ మార్చి 30న విడుదలైంది. కానీ హిట్ సాధించలేక బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సల్మాన్, రష్మిక ఏజ్ గ్యాప్ గురించి పెద్ద దుమారమే జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సల్మాన్ స్పందించినప్పటికీ వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి చర్చలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, ఈ విషయంపై బాలీవుడ్ నటి అమీషా పటేల్(Amisha Patel) రియాక్ట్ అయింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం పై కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘గత కొద్ది రోజుల నుంచి కొన్ని వార్తలు చూస్తున్నారు. రష్మిక, సల్మాన్ ఏజ్ గ్యాప్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో నటించాను. ‘గదర్-2’లో సన్నీ డియోల్ నాకంటే 20 ఏళ్లు పెద్దవారు. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను నచ్చింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని కూడా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. నాకు ‘సికందర్’ సినిమా నచ్చింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంటోంది. కారణం లేకుండా ఏ మూవీ విజయం సాధించదు. ఈ చిత్రంలో కంటెంట్ ఉంది కాబట్టి హిట్‌గా నిలుస్తుందని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆక అది చూసిన నెటిజన్లు పెద్ద వారితోనే రొమాన్స్ బాగుంటుంది.. సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయనే ఉద్దేశంలో ఆమె అలాంటి కామెంట్స్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






