నాగార్జున హీరోగా రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా "రోలుగుంట సూరి"

by Naga Rani Yarlagadda |

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా రోలుగుంట సూరి.

నాగార్జున హీరోగా రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా రోలుగుంట సూరి
X

దిశ, వెబ్‌డెస్క్: విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా రోలుగుంట సూరి. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరో హీరోయిన్లుగా అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సౌమ్య చాందిని ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్.. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారన్నారు. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించామని, సుభాష్ ఆనంద్ సినిమాలోని పాటలకు, బ్యాగ్రౌండ్ కు మంచి మ్యూజిక్ అందించారని తెలిపారు. యంగ్ టాలెంట్ ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అభినందించారన్నారు. ప్రణయ విరహ గీతంగా రచించిన "నిన్న.. మొన్న.." పాట ఆయనకెంతో నచ్చిందన్నారు. ఈ నెల 14న సినిమా విడుదల అవుతుందని, ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుందని, థియేటర్లలో చూసి సినిమాను ఆదరించాలని కోరారు.

Next Story