‘RK దీక్ష’.. జవాన్లకు అంకితం

by Sujitha Rachapalli |

ఆర్ కె ఫిలిమ్స్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో వస్తున్న చిత్రం ‘RK దీక్ష’. ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

‘RK దీక్ష’.. జవాన్లకు అంకితం
X

దిశ, సినిమా : ఆర్ కె ఫిలిమ్స్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో వస్తున్న చిత్రం ‘RK దీక్ష’. ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సుమన్. ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.. ‘ఈ సినిమా ఏడాదిలో పూర్తి చేశాము. ఐదు పాటలు, మూడు ఫైట్స్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్‌కు ఒక పాట ఈ సినిమా ద్వారా అంకితం చేశాము. జవాన్లకు మనం ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రేక్షకులు అంతా కలిసి మా సినిమాను ఆశీర్వదించి గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఇక హీరో కిరణ్, హీరోయిన్ అక్స ఖాన్, నటి మౌనిక రెడ్డి, జనరల్ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి, వైస్ చైర్మన్ గురు రాజ్, డి.ఎస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Next Story