- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కోసం నాకు ఇష్టమైన చీర కట్టుకున్నాను’.. ఆకట్టుకుంటోన్న నటి పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో సహాయక పాత్రలలో కనిపించింది.
అనుకోకుండా'లో తన నటన ప్రారంభించింది . ఈ లఘు చిత్రం 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. వర్మకు ఉత్తమ నటిగా అవార్డును కూడా తెచ్చిపెట్టింది. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌లో ప్రధాన పాత్రలో నటించింది. దీనిలో ఆమె శ్రీ విష్ణు సరసన కాస్ట్యూమ్ డిజైనర్ సమీరా పాత్రను పోషించింది.
తర్వాత రీతూ వర్మ తెలుగు చిత్రం పెళ్లి చూపులు (2016) లో ప్రధాన పాత్రలో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రానికి రీతూ వర్మ ఉత్తమ నటిగా నంది అవార్డును అండ్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈమె తెలుగులోనే ఎవడే సుబ్రమణ్యం (2015), కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్ (2020), ఒకే ఒక జీవితం (2022, మార్క్ ఆంటోని (2023) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రీతూ వర్మకు తెలుగులో వరుస అవకాశాలు లభించాయి.
అయితే రీతూ వర్మ ఇటీవల జరిగిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ నటి తనకు ఇష్టమై చీరను ఈ కార్యక్రమానికి కట్టుకుని వెళ్లినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. చక్కగా సంప్రదాయం ఉట్టిపడుతోన్న చీరపై దిగిన ఫొటోలు కూడా రీతూ అభిమానులతో పంచుకుంది. instagram link






