- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ritika Nayak : సందీప్‌తో మిరాయ్ బ్యూటీ!
సందీప్ కిషన్ పొలిటికల్ డ్రామా ‘పవర్ పేట’లో హీరోయిన్‌గా రితికా నాయక్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

దిశ, సినిమా: 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రితికా నాయక్.. హాయ్ నాన్న మూవీలో క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిరాయ్‌తో ఒక్కసారిగా క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అందం, అభినయంతో కుర్రాళ్లను సైతం ఆకట్టుకుని బిగ్ సక్సెస్ అందుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం డ్యూయెట్, కొరియన్ కనకరాజు మూవీస్‌లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో ఆఫర్ అందుకుంది రితికా. టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఈ ఏడాది పొలిటికల్ యాక్షన్ డ్రామా 'పవర్ పేట'తో రాబోతున్నాడు. ఈ మూవీలో సందీప్ సరసన 'మిరాయ్' బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు టాక్. దీనికి రౌడీ ఫెలో, చల్ మోహన్‌రంగ్ మూవీస్ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా... 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.
- Tags
- Ritika Nayak






