- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసారి కంప్లీట్ హారర్‌తో వస్తా.. న్యూ హిట్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా అప్డేట్
జెట్లీ సినిమా సక్సెస్ మీట్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ రితేష్ రానా.

దిశ, సినిమా: కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జెట్లీ’. ఈ మూవీతో రియా సింఘా అనే అందాల తార హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక రితేష్ రానా తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈసినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా తన తదుపరి ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చాడు. ‘నాకు మామూలుగా రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ చిత్రాలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. అందుకే ‘మత్తు వదలరా’ హిట్ అవ్వగానే 'హ్యాపీ బర్త్ డే' అనే ఎక్స్పెరిమెంట్ చేశాను.. వర్కౌట్ అవ్వలేదు. తర్వాత 'మత్తువదలరా 2' చేశాను హిట్ అయింది. ఇప్పుడు ‘జెట్ లీ’ అనే ప్రయోగం చేశాను. ఇది కూడా సక్సెస్ అయింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా నుంచి నేను మీకు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఏంటంటే.. నెక్ట్స్ నేను చెయ్యబోయే చిత్రంలో ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండద్దు అని ఫిక్స్ అయ్యా. ఈసారి కంప్లీట్ హారర్ చిత్రంతో వస్తున్నా. అందులో మీకు అసలు కామెడీనే దొరకదు.






