స్త్రీ వేషంలో వారి వాష్‌ రూమ్‌కు వెళ్లిన స్టార్ హీరో.. అసలు విషయం కనిపెట్టడంతో.. అక్కడి నుంచి పరార్..

by Sujitha Rachapalli |

దివంగత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తన సినీ ప్రయాణంలో 120కి పైగా చిత్రాల్లో నటించాడు. బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఆయన.. తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన ‘బాబీ’ చిత్రం ద్వారా హీరోగా మెరిశాడు.

స్త్రీ వేషంలో వారి వాష్‌ రూమ్‌కు వెళ్లిన స్టార్ హీరో.. అసలు విషయం కనిపెట్టడంతో.. అక్కడి నుంచి పరార్..
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తన సినీ ప్రయాణంలో 120కి పైగా చిత్రాల్లో నటించాడు. బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఆయన.. తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన ‘బాబీ’ చిత్రం ద్వారా హీరోగా మెరిశాడు. తొలి సినిమాతోనే రికార్డుల మోత మోగించాడు. చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. 1970, 80ల మధ్యలో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందాడు. అయితే ఇంత స్టార్ డమ్ ఉన్నా.. ఓ సినిమాలో అమ్మాయిగానూ కనిపించి మెప్పించాడు.

1975లో వచ్చిన ‘రఫూ చక్కర్’ మూవీలో తన భార్య, ప్రఖ్యాత నటి నీతూ కపూర్‌తో కలిసి నటించాడు. అయితే కశ్మీర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. ఓ ఫన్నీ ఘటన జరిగింది. ఆడ వేషంలో ఉన్న రిషి కపూర్.. పురుషుల వాష్ రూమ్‌కు వెళ్లగా.. అక్కడ ఉన్నవారు అవాక్కయ్యారట. అమ్మాయి పురుషుల వాష్ రూమ్‌కు వెళ్లిందేంటని షాక్ అయ్యారట. కానీ అతను రిషి అని తెలుసుకుని నవ్వుకున్నారట. దీంతో అతను సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడట.

Next Story