Rishab Shetty: పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం సులభమే.. కరూర్ ఇష్యూపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్‌లో వచ్చిన ‘కాంతార: చాప్టర్1’ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

Rishab Shetty: పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం సులభమే.. కరూర్ ఇష్యూపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్‌లో వచ్చిన ‘కాంతార: చాప్టర్1’ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ప్రజెంట్ మూవీ టీమ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న రిషబ్ శెట్టి తమిళనాడులోని జరిగిన కరూర్ ఇష్యూపై స్పందించాడు. ‘కరూర్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ప్రజలు హీరోలను ఆరాధిస్తారు. తమకు ఇష్టమైన హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు పాలాభిషేకాలు చేస్తారు. ఈ ఘటనపై స్పందించడానికి మాటలు రావడం లేదు.

ఇది ఒకరి వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇది సమష్టి వైఫల్యం కావొచ్చు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలు జరగవు. ఇలాంటి ర్యాలీలు ఉన్నప్పుడు క్రౌడ్‌ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం సులభమే. కానీ క్రౌడ్‌ని కంట్రోల్‌ చేయడం అంత ఈజీ కాదు’ అని తెలిపాడు. కాగా.. కరూర్‌లో టీవీకే చీఫ్‌, ప్రముఖ నటుడు విజయ్‌ చేపట్టిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు.

Next Story