- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంతార చాప్టర్ 1 ప్రభంజనం...బాహుబలి రికార్డులు బ్రేక్ !
హీరో రిషబ్ శెట్టి చిత్ర పరిశ్రమను షేక్ చేసేస్తున్నాడు. అతడు చేసిన తాజా మూవీ కాంతార చాప్టర్ 1 ( Kantara Chapter 1). ఈ సి

దిశ, వెబ్ డెస్క్ : హీరో రిషబ్ శెట్టి చిత్ర పరిశ్రమను షేక్ చేసేస్తున్నాడు. అతడు చేసిన తాజా మూవీ కాంతార చాప్టర్ 1 ( Kantara Chapter 1). ఈ సినిమా మొన్న దసరా కానుకగా రిలీజ్ అయి.. ప్రభంజనం సృష్టిస్తోంది. గడిచిన 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 675 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన బాహుబలి ది బిగినింగ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. బాహుబలి ది బిగినింగ్ సినిమా రూ. 650 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా రూ. 628 కోట్ల కలెక్షన్స్ రికార్డు కూడా బ్రేక్ అయింది కాంతార చాప్టర్ 1. ఈ నేపథ్యంలోనే భారత దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 సినిమాల్లో 17వ స్థానానికి కాంతార చాప్టర్ 1 ఎగబాకింది. ఈ 2025 సంవత్సరంలో అత్యధిక గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానంలో ఛావ రూ. 808 కోట్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా కాంతార చాప్టర్ 1 సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి చేయగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేశారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ రెండో తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది.
READ MORE ......






