- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘స్పిరిట్’లో త్రిప్తి నటించడంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. ఆమె రియాక్షన్ ఏంటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. పూర్తిగా సోషల్ మీడియాకు కూడా దూరం అయిన ఆయన కల్కి-2, సలార్-2, ఫౌజీ వంటి చిత్రాలు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన ‘స్పిరిట్’(Spirit) సినిమా చేయనున్నారు. అయితే మొదటిసారి ఇందులో డార్లింగ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి అప్డే్ట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ప్రియాంక చోప్రా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రియాంక అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను తొలగించారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే.. మూవీ మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్‌ను ప్రకటించడంతో సెన్సేషన్‌గా మారింది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) నటిస్తున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సినిమా ఏకంగా 9 భాషల్లో తెరకెక్కనున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ఈ పోస్టులు చూసిన వారంతా అసలు ఆమె సెట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
‘‘సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) త్రిప్తి ట్రెమండస్ ప్రదర్శనను స్క్రీన్‌పై చూడబోతున్నారు. ఇంతకు ముందే ‘యానిమల్’లో చూశారు. ఇక ఇప్పుడు ‘స్పిరిట్’ఆమెను హీరోయిన్‌గా పెట్టడం మంచి నిర్ణయం. ఆమె ఈ సినిమాలో నటించడం తనకు బిగ్ థింగ్ అవుతుంది. బాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారుతుంది. కంగ్రాట్స్ త్రిప్తి ఇదే నీకు సరైన సమయం ‘స్పిరిట్’ ద్వారా ఆకాశంలోకి ఎగురుతావు. ఇండస్ట్రీలో స్టార్‌గా మారుతావు’’ అని రాసుకొచ్చారు. ఇక అది చూసిన త్రిప్తి ధన్యవాదాలు చెప్పతూ ఆర్జీవీ కామెంట్లు తనకు ఎంతో విలువైనవని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






