RGV: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై రాంగోపాల్‌ వర్మ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-29 08:25:43  IST  )

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ (Betting Apps Promotion) చేసిన 11 మంది సెలబ్రిటీలు (Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (Social Media Influencers)పై ఇటీవలే పంజాగుట్ట (Panjagutta), మియాపూర్ (Miyapur) పోలీసులు కేసులు నమోదు చేశారు.

RGV: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై రాంగోపాల్‌ వర్మ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ (Betting Apps Promotion) చేసిన 11 మంది సెలబ్రిటీలు (Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (Social Media Influencers)పై ఇటీవలే పంజాగుట్ట (Panjagutta), మియాపూర్ (Miyapur) పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న వారంతా ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు బెట్టింగ్స్ యాప్స్ (Betting Apps Promotion) ప్రమోట్ చేయడం తప్పేముందని ప్రశ్నించారు. మార్కెట్‌లో అన్ని వస్తువులను ప్రమోట్ చేసినట్లుగానే బెట్టింగ్ యాప్స్‌ (Betting Apps)ను వారు ప్రమోట్ చేశారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నిషేధానికి ఒక చట్టం ఉంటే.. ఆ చట్టం ప్రకారంగానే అందరూ సెలబ్రిటీలు నడుచుకుంటారని కామెంట్ చేశారు. ఓ వస్తువు పాడయితే.. అది దానిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీపై కేసు వేస్తారా.. లేక కంపెనీపై వేస్తారా అని ప్రశ్నించారు. ఓ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే.. ఓటు అడిగిన వారిపై కేసు పెడతామా అంటూ ఆర్జీవీ సెటైర్లు వేశారు.

Next Story