- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డితో ఆర్జీవీ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఈ మేరకు కొండల్ రెడ్డితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈయన రేవంత్ రెడ్డి సోదరుడు కాదని సింహం సోదరుడు అని పేర్కొన్నారు. కొండల్ రెడ్డి పట్టు కూడా రేవంత్ రెడ్డి లాంటిదే అని వర్మ పేర్కొన్నారు. వర్మ ట్వీట్ కు కొండల్ రెడ్డి స్పందించారు. సింహాలతో పెరిగినప్పుడు పట్టు సహజంగానే మారుతుందని సమాధానం ఇచ్చారు.
మీ మాటలకు ధన్యవాదాలు, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా అంటూ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఈ మీటింగ్ ఎజెండా ఏంటి అంటూ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే ఆర్జీవీ కేవలం సినిమా తారలనే కాకుండా రాజకీయ నాయకులకు సైతం దగ్గరగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ నాయకుల బయోపిక్ లు తీయాలి అంటే ఆర్జీవీనే. కాబట్టి ఏదైనా బయోపిక్ కోసం ఆర్జీవీని కలిశారా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.






