- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RGV: ‘సిండికేట్’ మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్జీవీ.. పులి వేట మొదలైందంటూ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా ఆయన సినిమాలకు దూరం అయ్యారు. ఇక గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో వివాదాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఇక ఇటీవల ఆర్జీవీ ‘శారీ’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ క్రమంలోనే ఆయన ‘సిండికేట్’ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నుంచి ‘సత్య’ లాంటి హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇక వరుస పోస్టులు పెడుతూ హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఆర్జీవీ ‘సిండికేట్’(Syndicate) చిత్రంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘సిండికేట్‌తో తిరిగి వస్తున్నా’’ అనే క్యాప్షన్ జత చేసి పులి కెమెరాను నోట్లో పెట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో షూటింగ్ కోసం పులి వేట మొదలెట్టాడని అంతా ఫిక్స్ అయిపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఆర్జీవీ(RGV) నుంచి రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరికీ ఈ మూవీ స్టోరీపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.






