సెన్సార్ బోర్డ్‌పై ఆర్జీవీ ఫైర్.. సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-25 14:25:38  IST  )

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటారు.

సెన్సార్ బోర్డ్‌పై ఆర్జీవీ ఫైర్.. సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్న వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటారు. కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం తన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ అందరి చేతుల్లో సెల్‌ఫోన్లు ఉన్నాయి. ఫోర్న్ వీడియోలు చూస్తున్నారు. సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి. సెన్సార్ బోర్డ్ అనేది పాతబడిన వ్యవస్థ. అది 1952 సినిమాటోగ్రఫీ నుంచి వచ్చింది. ప్రస్తుతం ఓ వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతుందో తెలుసుకునే సోషల్ మీడియా యుగంలో ఉన్నారు. ఈ రోజుల్లో ఓ పర్టిక్యులర్ 10 మంది ఇది చూస్తే సరికాదు అనే స్టుపిడెస్ట్ థింగ్.

ఇంటర్నెట్ యాక్సెస్‌తో రియల్ లైఫ్ వయలెన్స్ ఫో**ర్న్ అన్ని చూస్తున్నారు. అలాంటప్పుడు ఎంటర్‌టైన్‌‌మెంట్ కోసం క్రియేట్ చేసే సినిమాలోని కొన్ని పదాలకు అభ్యంతరం చెప్పడం కంటే స్టుపిడిటీ ఏముంటుంది. డంబ్ అని భావించే సెన్సార్ బోర్డు సభ్యులు ప్రేక్షకులను పిల్లలను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారు. ప్రేక్షకులను పిల్లలను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారు. జ్యూరీలో ర్యాండమ్ పీపుల్ ఉంటారు. అలాంటి ఐదుగురు సభ్యులు కోట్ల మంది అభిరుచిని ఎలా నిర్ణయించగలరు’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఆర్జీవీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బూతులు ఉన్న సినిమాలు ఫ్యామిలీతో కలిసి ఎలా చూస్తారు.. ఆ మాత్రం సెన్స్ కూడా లేదా అలా మాట్లాడటానికి అని తిడుతున్నారు.

https://x.com/Movies4u_Officl/status/1925567575897121102

Next Story