గోటీల ఫ్యాక్టరీలో రూ.3 కోట్ల ఆదాయం.. రాజశేఖర్ వైరల్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

ప్రస్తుతం నేను చాలా బిజీ అయిపోయాను. రోజు నా గోటీల ఫ్యాక్టరీకి వెళ్లి వస్తుంటాను. ఆ ఫ్యాక్టరీ ద్వారా నాకు నెలకు రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో నాకే తెలియదు.

గోటీల ఫ్యాక్టరీలో రూ.3 కోట్ల ఆదాయం.. రాజశేఖర్ వైరల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లపై ఆయన స్పందించి తనకు ఏ ఫ్యాక్టరీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వార్తలకు చెక్ పడినప్పటికీ రాజశేఖర్ మాత్రం మళ్లీ మళ్లీ ఈ విషయంపై రియాక్ట్ అయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా, ఓ టీవీ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. "ప్రస్తుతం నేను చాలా బిజీ అయిపోయాను. రోజు నా గోటీల ఫ్యాక్టరీకి వెళ్లి వస్తుంటాను. ఆ ఫ్యాక్టరీ ద్వారా నాకు నెలకు రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో నాకే తెలియదు. ప్రస్తుతం నేను కూడా అదే ఫ్యాక్టరీ కోసం వెతుకుతున్నాను" అని నవ్వుతూ చెప్పారు. రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ చూసి నెటిజన్లు బాస్ టైమింగ్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే షోలో తన డ్యాన్స్ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు డ్యాన్స్ చేయాలంటే తనకు భయంతో జ్వరం వచ్చేదని, కానీ ఇప్పుడు అది అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి తనపై వచ్చే ట్రోల్స్‌ను రాజశేఖర్ లైట్ తీసుకోవడమే కాకుండా, వాటిని ఎంజాయ్ చేస్తూ రివర్స్ కౌంటర్లు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గోటీల ఫ్యాక్టరీ పుకారును ఆయన డీల్ చేసిన విధానం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తమ అభిమాన హీరో ఇలా సరదాగా ఉండటం చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.

Next Story