నా ఎక్స్ ఖాతాలో వాటికి రిపోర్ట్ కొట్టండి.. అభిమానులను కోరిన ప్రముఖ సింగర్

by Ramesh Goud |   (  Updated:2025-04-08 14:51:40  IST  )

నా ట్విట్టర్ ఖాతాలో ప్రమోట్ అవుతున్న యాడ్స్ కి రిపోర్ట్ కొట్టాలని ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ (Singar Shreya Ghoshal) అభిమానులను కోరారు.

నా ఎక్స్ ఖాతాలో వాటికి రిపోర్ట్ కొట్టండి.. అభిమానులను కోరిన ప్రముఖ సింగర్
X

దిశ, వెబ్ డెస్క్: నా ట్విట్టర్ ఖాతాలో ప్రమోట్ అవుతున్న యాడ్స్ కి రిపోర్ట్ కొట్టాలని ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ (Popular Singer Shreya Ghoshal) అభిమానులను కోరారు. కొద్ది రోజుల క్రితం శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్ (Shreya Ghoshal X Account Hack) కు గురైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13 నుంచి తన ఎక్స్ ఖాతా హ్యాక్ కు గురైందని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఎక్స్ ఖాతాలో అశ్లీల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని దయచేసి తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని శ్రేయా ఘోషల్ ఫ్యాన్స్ ను కోరింది. దీనిపై ఫిర్యాదు చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (Instagram Account) ద్వారా వీడియో (Video)ను పోస్ట్ చేసింది.

అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా రికవరీ (X Account Recovery) అయ్యిందని మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో తన ఎక్స్ ఖాతా కొద్ది నెలల క్రితం కొందరు హ్యాక్ చేశారని, ఇప్పుడు మళ్లీ రికవరీ అయ్యిందని తెలిపింది. దీనికి ఓ వ్యక్తి తనకు సహాయం చేశాడని, ఇక నుంచి ట్విట్టర్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపింది. అలాగే శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా తన ఎక్స్ ఖాతా తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పింది. అంతేగాక తన ఎక్స్ ఖాతాలో ఇప్పటికీ కొన్ని బెట్టింగ్ యాడ్స్ (Betting Ads), స్పామ్ యాడ్స్ (Spam Ads) ప్రచారంలో ఉన్నాయని, అభిమానులు వాటిని రిపోర్ట్ (Report) చేయాలని గాయని కోరింది.

Next Story