- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుపట్టలేని స్థితిలో హీరో దర్శన్..ఫోటో వైరల్ !
దర్శన్ అని గుర్తించలేరు. జైలు జీవితం గడుపుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ అవతారం పూర్తిగా మారిపోయిందని ఈ ఫోటోను చూసిన

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాలు చేసి, పాపులర్ అయిన హీరో దర్శన్ జైలు పాలయ్యాడు. రేణుక స్వామి హత్య కేసులో హీరో దర్శన్ ప్రధాన నిందితుడు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు పోలీసులు. ఇక జైలు జీవితం అనుభవిస్తున్న హీరో దర్శన్ ఫోటోలు తాజాగా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో హీరో దర్శన్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.
బాగా పరిశీలిస్తే తప్ప, అతను దర్శన్ అని గుర్తించలేరు. జైలు జీవితం గడుపుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ అవతారం పూర్తిగా మారిపోయిందని ఈ ఫోటోను చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ కు ఇటీవల బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకుండా రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.






