Renu Desai: కేటీఆర్ వీడియో షేర్ చేస్తూ రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్..

by Mallepaka Hamsa |

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య నటి రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Renu Desai: కేటీఆర్ వీడియో షేర్ చేస్తూ రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్..
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య నటి రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన ఆమె పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏమైందో తెలియదు కానీ వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో కొన్నేళ్ల పాటు తన పిల్లల బాధ్యత తీసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో పూర్తి సినిమాలకు దూరంగా ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి జంతువులకు సాయం చేస్తూ అందరి దగ్గర విరాళం అడుగుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది.

అయితే ఇటీవల రేణు దేశాయ్ హెచ్‌సీయూపై సంచలన పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ మాజీ సీఎం కొడుకు కేటీఆర్ వీడియో షేర్ చేస్తూ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో ఆయన మేం అధికారంలోకి రాగానే హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఎకో పార్క్‌లాగా మారుస్తాం’’ అని అన్నారు.దీనిపై రేణు స్పందిస్తూ.. ‘‘వారి చేతిలో పవర్ ఉన్నప్పుడు ఎకో పార్క్ చేయలేదు. కానీ ఇప్పుడు 5 రోజుల్లో ఎకరాల అడవి పోయింది. ఇప్పుడు కొత్త ఓట్ల కోసం ఇదంతా మాట్లాడుతున్నారు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం రేణు పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తూ కేటీఆర్‌ను తిడుతున్నారు.

Next Story