Renu Desai: ప్లీజ్ దయచేసి సహాయం చేయండి అంటూ స్కానర్ పంపించిన రేణు దేశాయ్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by I. Sairam |

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Renu Desai: ప్లీజ్ దయచేసి సహాయం చేయండి అంటూ స్కానర్ పంపించిన రేణు దేశాయ్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అయితే రేణు దేశాయ్ శ్రీ మధ్య యానిమల్ షెల్టర్ పేరుతో ఓ మూగజీవాల సంస్థను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. అందులో, ‘జూన్ అండ్ జూలై నెలలో చాలా సీరియస్ యాక్సిండెంట్స్ కేసులు, ట్యూమర్ సర్జరీస్ జరిగాయి. కాబట్టి మీ దయగల హృదయంతో మాకు డొనేట్ చేయండి’ అంటూ ఫోన్ పే స్కానర్‌ను పెట్టింది. దీంతోఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.






Next Story