- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renu Desai: ‘21 లవ్’ అంటూ అకిరా నందన్ లేటెస్ట్ లుక్ పంచుకున్న రేణు దేశాయ్.. పవర్‌స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న ఫొటో
నేడు పవర్‌స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పెద్ద కుమారుడు అకిరా నందర్ (Akira Nandar) పుట్టిన రోజు.

దిశ, వెబ్‌డెస్క్: నేడు పవర్‌స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పెద్ద కుమారుడు అకిరా నందర్ (Akira Nandar) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన పుట్టినరోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తల్లి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆకట్టుకునే మ్యూజిక్ యాడ్ చేసి అద్భుతమైన లొకేషన్‌లో అకిరా నందర్ దిగిన ఫొటోను షేర్ చేసింది. ఈ పిక్‌కు రేణు దేశాయ్ 21 లవ్ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం అకీరా లేటెస్ట్ లుక్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కానీ నేడే (ఏప్రిల్ 8) పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar)కు గాయాలైన విషయం తెలిసిందే. పవర్ స్టార్ భార్య అన్న లెజనోవా (Anna Lezhanova) తన పిల్లలతో కలిసి సింగపూర్(Singapore)లో ఉంటోంది. కాగా పిల్లలు అక్కడే స్టడీ చేస్తున్నారు. మార్క్ శంకర్ చదువుకుంటోన్న పాఠశాలలో మార్నింగ్ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. అతడి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అలాగే లంగ్స్‌లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందికి లోనయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.






