- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో సినిమా ఓకే చేసిన రేణు దేశాయ్.. నాకు ఇష్టమైన రోల్ ఇదే అంటూ కామెంట్స్
‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘16 రోజుల పండగ’.

దిశ, సినిమా: ‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘16 రోజుల పండగ’. ఈ చిత్రంతో సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు డి సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి దామోదర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీమ్‌కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ.. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై '16 రోజుల పండగ' సినిమా ఈ రోజు ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన శేఖర్ కమ్ముల, సురేష్ బాబు, కోన వెంకట్, రాధా మోహన్‌లకు ధన్యవాదాలు. '16 రోజుల పండగ' టైటిల్‌ని సజెస్ట్ చేసింది కృష్ణ వంశీ. ఆయనకి కథ విపరీతంగా నచ్చి ఈ టైటిల్ పెట్టమని చెప్పారు. కృష్ణ వంశీకి థాంక్ యూ’ అని అన్నారు.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. సాయి కిరణ్ కోవిడ్ లాక్ డౌన్‌కి ముందే ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పాను. ఇందులో అత్తమ్మ రోల్ చేస్తున్నాను. నా ఏజ్‌కి సరిపోతుందా అనిపించింది. కానీ ఆ పాత్ర, కథ అద్భుతమైనది. సినిమా చూస్తున్నప్పుడే ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. సాయి కిరణ్ చాలా మంచి దర్శకుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్ యూ’ అని తెలిపింది.






