‘హనుమాన్ జయంతి సందర్భంగా ఏఐ చిత్రాన్ని రూపొందించిన ఆద్య’.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

by Kodari Anjali |

పవర్‌స్టార్ పవన్ కల్యాన్ (Powerstar Pawan Kalyan) మాజీ సతీమణి రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘హనుమాన్ జయంతి సందర్భంగా ఏఐ చిత్రాన్ని రూపొందించిన ఆద్య’.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాన్ (Powerstar Pawan Kalyan) మాజీ సతీమణి రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె తరచూ పిల్లలు అకీరా నందర్ (Akira Nandan), ఆద్య (Aadya)లకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. పిల్లలకు సంబంధించిన స్పెషల్ డేస్(బర్త్ డే), స్టడీస్ గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రేణు దేశాయ్ ఆద్య చేసిన గొప్ప పనిని నెట్టింట అభిమానులతో పంచుకుంది. నేడు హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటోన్న విషయం తెలిసిందే.

కాగా ఈ సందర్భంగా ఆద్య హనుమాన్ ఏఐ చిత్రాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘రామ్ దువారే తుమ్ రఖ్వారే.. హాట్ నా అగ్యా బిను పైసరే..సబ్ సుఖ్ లహై తుమ్హారీ సరనా.. తుమ్ రక్షక్ కాహు కో దర్నా. అని రాసుకొచ్చి.. హనుమాన్ జయంతి సందర్భంగా ఆద్య ఈ ఏఐ చిత్రాన్ని రూపొందించింది. మీరు స్వచ్ఛమైన హృదయంతో, హృదయపూర్వక ఉద్దేశ్యంతో అతనిని పిలిచినట్లయితే అతను నిజంగా సహాయం చేస్తాడని నన్ను నమ్మండి’’. అంటూ వ్యాఖ్యలు జోడించింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story