‘వేసవి జల్లులు చాలా అవసరం’.. పవర్‌స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్

by Kodari Anjali |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘వేసవి జల్లులు చాలా అవసరం’.. పవర్‌స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి సినిమాల్లో నటించే క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు చిహ్నంగా అకీరా నందన్ (Akira Nandan), ఆద్య (Aadya) జన్మించారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అండ్ రేణు దేశాయ్ విడిపోయారు.

అయినప్పటికీ పిల్లల్ని తండ్రి దగ్గరకు పంపిస్తూ.. అకీరా, ఆద్యల బాధ్యతలు చూసుకుంటోంది. ఇక రేణు దేశాయ్ వివాహనంతరం సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పెళ్లైనాక సినిమాలకు దూరమైన రేణు దేశాయ్ మాస్ మహారాజా కీలక పాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) చిత్రంలో లవణం పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీలో నటించింది. ఇకపోతే రేణు దేశాయ్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను పలకరిస్తుంటుంది.

ఎక్కువగా జంతువులకు సంబంధించినవి పెడుతుంటుంది. రేణు దేశాయ్ జంతువుల్ని ఎక్కువగా ప్రేమిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వర్షం పడే ఓ వీడియో పంచుకుంది. దీనికి ‘వేసవి జల్లులు చాలా అవసరం’ అని క్యాప్షన్ జోడించింది.

Next Story