- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా స్నేహితులు చాలా మంది ఈ వీడియో చేయవద్దని నన్ను కోరారు కానీ’: రేణు దేశాయ్ సంచలన వీడియో పోస్ట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. యూనివర్సిటీలోని 400 ఎకరాల ల్యాండ్‌ను అమ్మాలనుకుంటోన్నప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీంతో ఇప్పటికే పలువురు హెచ్‌సీయూ విద్యార్థుల్ని అరెస్ట్ చేసి.. పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయలవ్వగా.. మరికొంతమంది స్పృహతప్పి కిందపడిపోయారు. అలాగే ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాల జోలికి రావద్దని విద్యార్థులు అన్నారు.
అంతేకాకుండా ఆ భూముల్ని యూనివర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసివ్వాలని కోరారు. అయితే హచ్‌సీయూలో నెలకొన్న వివాదంపై చాలా మంది విద్యార్థి సంఘాలకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Andhra Pradesh Deputy CM Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) కూడా సపోర్ట్ గా మాట్లాడింది. నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా.. తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ‘‘నా స్నేహితులు చాలా మంది ఈ వీడియో చేయవద్దని నన్ను కోరారు.
కానీ ఒక తల్లిగా నా మనస్సాక్షి నన్ను ఇలా చేయమని బలవంతం చేసింది. మేము మా పిల్లలకు ఉత్తమ విద్య, ఉత్తమ ఆహారం. వారి భవిష్యత్తు కోసం చాలా డబ్బు సంపాదిస్తున్నాము. కానీ మరేదైనా ముందు మాకు ఆక్సిజన్, నీరు అవసరం. తల్లిదండ్రులుగా మా అభ్యర్థనను మా స్వంత అధికారులు విని ఏదైనా అద్భుతం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. ’సేవ్ ఫారెట్, సేవ్ ట్రీస్, జంతువుల్ని సేవ్ చేయండి’’ తెలిపారు.






