- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే చేసుకుంటాను అంటూ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johney), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది రెండో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘రెండో పెళ్లి చేసుకోవడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడే కాకుండా రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను.
అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పిల్లల కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు . నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా, అప్పట్లో పిల్లలు చిన్న వారు కావడంతో వాళ్లను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం సబబు కాదు అనిపించింది. వాళ్లకు తండ్రి దూరంగా ఉన్నాడు. నేను దూరమైతే వాళ్లు ఒంటరితనంతో బాధపడతారు అనిపించింది. అకీరా, ఆద్య కూడా నన్ను మ్యారేజ్ చేసుకోమంటున్నారు. తన పిల్లలు కూడా మద్దతుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. నా పెళ్లి గురించి పిల్లలు చాలా పాజిటివ్‌గా ఉన్నారు.
మమ్మీ, నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్లని పెళ్లి చేసుకో అని చెప్పడం నాకు ధైర్యం ఇచ్చింది. వాళ్లే నన్ను మ్యారేజ్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే నాకు పూర్తిగా స్వేచ్ఛ వస్తుంది, అప్పుడు నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని భావిస్తున్నాను. పిల్లలు కాలేజ్‌కి వెళ్తే వాళ్లకి కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. అప్పుడూ అంతగా తల్లిదండ్రులపై డిపెండెంట్‌గా ఉండరు. అప్పుడు నేను కూడా నా జీవితాన్ని ఆనందించగలుగుతాను’ అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.






