- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ హైకోర్టులో నాగచైతన్యకు ఊరట
తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కోర్టు మెట్లెక్కారు.

దిశ, సినిమా: తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కోర్టు మెట్లెక్కారు. అనుమతి లేకుండా నా పేరు, ఫొటోలు, వాయిస్‌ను కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ దుర్వినియోగం చేస్తున్నారని, అలా చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ నాగచైతన్య ఢిల్లీ హైకోర్టులో ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా.. కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన అనధికారిక కంటెంట్, డీఫ్ ఫేక్ అండ్ తన పోలీకలతో ఉన్న వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ తన ప్రతిష్టకు, పరువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెలబ్రిటీల హోదాను అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న ఈ పనులకు తన వ్యక్తిగల జీవితం సైతం ఇబ్బందుల్లో పడుతుందని ఆయన తెలిపారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు హీరోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు నాగచైతన్య వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫేస్, వాయిస్ ఉపయోగించడంపై నిషేధం విధించింది.






