- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ReginaCassandra: ఆ పాత్రకు ముందు వేరే హీరోయిన్‌ను అనుకున్నారు.. కానీ నేను సెట్ అవుతా అని నన్ను తీసుకున్నారు.. రెజీనా వైరల్ కామెంట్స్
‘శివ మనసులో శృతి’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసండ్రా.. ఎన్నో సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది.

దిశ, సినిమా: ‘శివ మనసులో శృతి’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసండ్రా.. ఎన్నో సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇక గత ఏడాది ‘ఉత్సవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ప్రస్తుతం ‘మూకుతి అమ్మన్ 2’ చిత్రంతో బిజీగా ఉంది. అలాగే మరో రెండు, మూడు ప్రాజెక్టులు ఈ బ్యూటీ లైన్‌లో పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తాను నటించిన విడాముయర్చి చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన ఈ మూవీ మగిళ్ తిరుమేని తెరకెక్కించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీలో రెజీనా ‘దీపిక’ పాత్రలో కనిపించి.. తన నటనతో మంచి మార్కులే సొంతం చేసుకుంది. అయితే.. రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా దీపిక పాత్రపై మాట్లాడుతూ.. ‘విడాముయర్చి సినిమాలో నేను పోషించిన పాత్రకు మొదట వేరొక హీరోయిన్‌ను తీసుకున్నారుఅనుకున్నారు. దర్శకుడు మగిల్ తిరుమేని నాకు మొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ ప్రాత కోసం వేరే హీరోయిన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఈ దీపిక పాత్ర మీకు సరిగ్గా సరిపోతుంది అందుకే నిన్ను సంప్రదించాను అని తెలిపారు. ఆ విధంగా నేను ఈ సినిమాలో భాగం అయ్యాను. విడాముయర్చి సినిమాలో దీపిక పాత్ర నాకు ఎంతో నచ్చింది’ అని తెలిపింది.






