- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Regina Cassandra: కొన్ని కథలు అంత ఈజీ కాదు.. రెజీనా కసాండ్రా పోస్ట్
రెజీనా కసాండ్రా.. ప్రస్తుతం తమిళంలో ‘మూకుతి అమ్మన్ 2’, ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాలతో పాటు.. హిందీలో ‘సెక్షన్ 108’ మూవీ చేస్తుంది.

దిశ, సినిమా: రెజీనా కసాండ్రా (Regina Cassandra).. ప్రస్తుతం తమిళంలో ‘మూకుతి అమ్మన్ 2’, ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాలతో పాటు.. హిందీలో ‘సెక్షన్ 108’ మూవీ చేస్తుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మరో చిత్రాన్ని ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ రాబోతున్న ‘ది వైవ్స్’ (TheWives)కు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రెజీనాతో పాటు సోనాలి కులకర్ణి, మౌని రాయ్, రాహుల్ భట్, సౌరభ్ సచ్‌దేవా, అర్జన్ బజ్వా అండ్ ఫ్రెడ్డీ దారువాలా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ భార్యల జీవితాల గురించి, వారి జీవితాల్లోని గ్లామర్, రహస్యాలు, గొడవలు అండ్ లగ్జరీ గురించి ఎక్స్‌ప్లోర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ భండార్కర్ (Director Bhandarkar) ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. (ది వైవ్స్ తో సమాజంలోని కనిపించే మరో ఎట్రాక్టీవ్ పొరను తొలగించి.. దాని కింద దాని ఉన్న అసలు నిజాన్ని చూపించాలనుకుంటున్నాను. ఈ చిత్రం తరచుగా కనిపించే కథలకు.. అరుదుగా వినిపించే మహిళల రహస్యాలు, పోరాటాలు, స్థితిస్థాపకతను ధైర్యంగా, నిర్మొహమాటంగా చూపిస్తుంది’ అని తెలిపారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రెజీనా కొన్ని ఫొటోలను పంచుకుంటూ.. ‘కొన్ని కథలు చెప్పడం అంత ఈజీ కాదు.. అలాంటి వాటిలో ది వైవ్స్ ఒకటి. మధుర్ సర్ యొక్క ఈ పవర్‌ఫుల్ కథలో భాగం కావడం ఎంతో గౌరవంగా ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చింది. లింక్






