- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రీల్ కపుల్.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
నేచురల్ స్టార్ నాని(Nani), శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani), శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజీస్‌లో తెరకెక్కుతుండగా.. దీనిని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tipirneni) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఇక ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని, శ్రీనిధి శెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా అంతకుముందు నానితో పాటు మూవీ టీమ్ కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






